V6 News

జ్యోతిష్యం:  మీనరాశిలోకి శని, కుజుడు.. చంద్ర సంచారంలో మార్పు..  నాలుగు రాశుల వారికి తిరుగులేని అదృష్టం..

జ్యోతిష్యం:  మీనరాశిలోకి శని, కుజుడు.. చంద్ర సంచారంలో మార్పు..  నాలుగు రాశుల వారికి తిరుగులేని అదృష్టం..

వైశాఖ పౌర్ణమి.. బుద్ద పౌర్ణమి 2026 మే 1 శుక్రవారం. ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైన రోజు.   జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ ఏడాది (2026) అలాంటి పవిత్రమైన రోజున  మీనరాశిలో శని.. కుజుడు  కలయిక వలన  బుధాదిత్య యోగం, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి.  ఇంకా  అదే రోజు ( 2026 మే 1 శుక్రవారం ) ఉదయం 2.16 గంటలకు  రాహువుచంద్రుడు ... రాహువు అధిపతి అయిన స్వాతి  నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు.  ఈ గ్రహాల సంచారంలో మార్పు వలన నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగనున్నాయి.  ఇప్పుడు ఆ అదృష్టరాశుల గురించి తెలుసుకుందాం. . 

మిధున రాశి: ఈ రాశి వారికి  వైశాఖ పౌర్ణమి వేళ చంద్ర సంచారంలో మార్పు వలన అన్ని విధాలుగా శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు.. చేతి వృత్తుల వారి  సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు. బిజినెస్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది.  ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.ఆర్థిక లాభాలు కలగనున్నాయి. శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. . కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వ్యాపారాలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా.. మంచి విజయాలు అందుకుంటారు. 

కర్కాటకరాశి: చంద్రుడు నక్షత్ర మార్పు  ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను కలుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  కోర్టు సంబంధిత విషయాల్లో మంచి పరిష్కారం లభిస్తుంది.  కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తొలగుతాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు అందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

సింహరాశి:  చంద్రగ్రహం సంచారంలో మార్పు .. మీనరాశిలో కుజుడు.. శని కలయిక వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాశం పెరిగే అవకాశం ఉంది.  తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా సానుకూల పలితాలుంటాయి.  సమాజంలో ఉన్నత వ్యక్తులు పరిచయవుతారు.  గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి: వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు నక్షత్రం మార్పు వలన  ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు ఊహించని లాభాలు కలుగుతాయి.  విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.పాత బకాయిలు  వసూలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు  ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.